న్యాయస్థానాల్లోకి వచ్చేందుకు లాయర్లకు అనుమతి....

- October 22, 2021 , by Maagulf
న్యాయస్థానాల్లోకి వచ్చేందుకు లాయర్లకు అనుమతి....

సౌదీ అరేబియా: సౌదీలో అన్ని కోర్టులలో కోవిడ్ రూల్స్ ను సులభతరం చేశారు. కోర్టులలో లాయర్లను అనుమతించనున్నారు. ఇన్నాళ్లు కరోనా ఎఫెక్ట్ కారణంగా వర్చువల్ గానే కేసులను విచారిస్తున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో లాయర్లను కోర్టులలోకి అనుమతించాలని సౌదీ న్యాయశాఖ నిర్ణయించింది. దేశంలోని అన్ని కోర్టులలోకి లాయర్లకు పర్మిషన్ ఇచ్చింది. క్లయింట్స్ ను మాత్రం రిసెప్షన్ వరకే అనుమతించనున్నారు. అక్కడ నుంచే వారు క్లయింట్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది. న్యాయశాఖకు సంబంధించిన అధికారుల విజ్ఞప్తి మేరకు హెల్త్ డిపార్ట్ మెంట్ రూల్స్ ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ న్యాయశాఖ తెలిపింది. అదే విధంగా ఈ లిటిగేషన్ ప్రొసీజర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఈ ప్రొసీజర్ ను కూడా అనుమతిస్తామంది. ఐతే కోర్టులో కి ఎంట్రీ ఇచ్చే వారందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. నెల రోజుల తర్వాత పరిస్థితిని బట్టి మరిన్ని సడలిపంపులు ఇస్తామని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com