రష్యాలో విమాన ప్రమాదం ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి...

- March 19, 2016 , by Maagulf
రష్యాలో  విమాన ప్రమాదం   ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి...

రష్యాలో శనివారం ఉదయం విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు ఫ్లైదుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. దుబాయ్‌లోని ఫ్లైదుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్‌ విమానం రష్యాలోని రోస్తవ్‌ విమానాశ్రయంలో దిగుతుండగా కుప్పకూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది సహా 61 మంది మృతిచెంచారు. కాగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com