చిన్నారుల కలల ప్రపంచం డిస్నీల్యాండ్ ను హైదరాబాద్ లో

- March 19, 2016 , by Maagulf
చిన్నారుల కలల ప్రపంచం డిస్నీల్యాండ్ ను హైదరాబాద్ లో

చిన్నారుల కలల ప్రపంచం డిస్నీల్యాండ్ ను హైదరాబాద్ లోనూ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీల్యాండ్ ను హైదరాబాద్ కు ఎలా తేగలం అంటే కచ్చితంగా తెచ్చే తీరుతాం అంటుంది తెలంగాణా ప్రభుత్వం. ఇప్పటికే టూరిజం శాఖ దీనికి సంబంధించిన వివరాల సేకరణను తీసుకుంటున్నారట. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది 300 ఎకరాల విస్తీర్ణంలో 25వేల కోట్ల రూపాయలతో రూపొందించబడుతుందని అంటున్నారు. పురాతన భవనాలు, యూరోపియన్ భవనాలు, జెయింట్ డ్రాగన్లు, డొనాల్డ్ డక్ లాంటి డిస్నీల్యాండ్ లక్షణాలన్ని హైదరాబాద్లో కనిపించనున్నాయి. ఇప్పటికే యూ.ఎస్.ఏ నుండి ఓ ప్రతినిధి బృధం దీనికి సంబంధించిన చర్చలు జరిపేందుకు హైదరబాద్లో ఎలాంటి వాతారణంలో దాన్ని రూపొందించాలో ఓ నియమావళిని ఏర్పాటుచేస్తున్నారట.ఇక్కడ ఉన్న అవసరాల రీత్యా డిస్నీల్యాండ్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తుంది. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం.. డిస్నీ అందాలను చూడాలనుకున్న వారు అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు హైదరాబాద్ వస్తే చాలు అన్న ఆలోచనతో ఈ డిస్నీల్యాండ్ కార్యరూపం దాల్చుతున్నారు. అయితే సిటీకు అవుట్ స్కట్స్ లో అత్యధిక ప్రభుత్వ ప్రదేశం ఉన్న భాగంలోనే ఇది రూపొందించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఏర్పడే డిస్నీలో మీ పిల్లలను ఆడించడానికి మీరు రెడీ అయ్యిపోండిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com