డ్రైవింగ్ లైసెన్స్, కారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డిజిటలైజేషన్
- October 23, 2021
కువైట్: కువైట్ మొబైల్ ID యాప్ తరహాలో డ్రైవింగ్ లైసెన్స్, కారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లను కూడా డిజిటలైజ్ చేయాలని ట్రాఫిక్ విభాగం యోచిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్, కారు రిజిస్ట్రేషన్ వివరాలను కువైట్ మొబైల్ ఐడి యాప్ తరహాలో పొందుపరచడం లేదా దీని కోసం కొత్త యాప్ ను తీసుకురావాలని ట్రాఫిక్ విభాగం ఉన్నత అధికారులు ఆలోచన చేస్తున్నట్లు స్థానిక అరబిక్ దినపత్రిక అల్-రాయ్ పేర్కొంది. ట్రాఫిక్ ఉల్లంఘనలలోనూ డిజిటల్ టెక్నాలజీని ఎనేబుల్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది కార్యారూపం దాల్చితే ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడిన వెంటనే వారికి టెక్స్ట్ మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ వెళ్తుంది. దీనిద్వారా ఉల్లంఘన విలువ, టైమ్ అదా అవుతుంది. కువైట్ మొబైల్ ID అప్లికేషన్ విజయవంతం అయిన నేపథ్యంలో మరిన్ని విభాగాలను డిజిటలైజ్ పరిధిలోకి తేవాలని అధికారులు భావిస్తున్నారని అల్-రాయ్ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







