వచ్చే ఏడాది నాటి అన్ని స్కూళ్లలో డిజిటల్ ఎంపావర్ మెంట్ తప్పనిసరి
- October 23, 2021
మనామా: వర్చువల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ తో సెంట్రల్ వర్చువల్ క్లాస్ రూమ్స్ పై ఎఫెక్ట్ తగ్గిందని నేషనల్ అడిట్ ఆఫీస్ తన 18 వ యాన్వల్ రిపోర్ట్ లో తెలిపింది. వర్చువల్ క్లాస్ రూమ్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో స్టూడెంట్స్ కొంత నేర్చుకోవటం తగ్గిందని తెలిపింది. సెంట్రల్ వర్చువల్ క్లాస్ రూమ్ లలో చదువుకున్న పిల్లలు గ్రేడ్ పరంగా ముందున్నట్లు గుర్తించారు. ఈ ఏడాదిలో దాదాపు 45 స్కూళ్లను నేషనల్ అడిట్ కమిటీ సందర్శించింది. స్కూళ్లలో టెక్నాలజీ, ఇంటర్ నెట్ కు సంబంధించిన సౌకర్యాలను పరిశీలించింది. చాలా స్కూళ్లు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించటం లేదని అధికారులు తెలిపారు. అదే విధంగా వర్చువల్, డిజిటల్ క్లాస్ ల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలు కూడా చాలా స్కూళ్లలో లేవంట. టెక్నాలజీ కి సంబంధించి ఉద్యోగులకు కూడా సరైన నాలెడ్జ్ లేదని గుర్తించారు. ఇక 45 స్కూళ్లలో ఐతే వైర్ లెస్ నెట్ వర్క్ లేదని అధికారులు రిపోర్ట్ లో తెలిపారు. కరోనా మహమ్మరి కారణంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మిషన్ అనేది తప్పనిసరి అయింది. అందుకు తగిన విధంగా అన్ని స్కూళ్లు కూడా టెక్నాలజీని సమకూర్చుకోవాలని కమిటీ కోరింది. టెక్నికల్ గా ఎడ్యుకేషన్ ను నేర్పేందుకు అవసరమైన నాలెడ్జ్ ను టీచర్లు అప్ డేట్ కావాలని కోరింది. అదే విధంగా వచ్చే ఏడాది నాటికి అన్ని స్కూళ్లలో డిజిటల్ ఎంపావర్ మెంట్ కోసం కృషి చేయాలని రిపోర్ట్ లో కోరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







