సమరానికి రంగం సిద్ధం..నేడు ఆసీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తో షురూ

- October 23, 2021 , by Maagulf
సమరానికి రంగం సిద్ధం..నేడు ఆసీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తో షురూ

యూఏఈ: టీ20 ప్రపంచకప్ 2021 అసలు సిసలైన పోరుకు రంగం సిద్దమైంది. యూఏఈ వేదికగా నేటి (అక్టోబర్ 23) నుండి గ్రూప్ ఏ మ్యాచ్ లతో పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ అబుధాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మొదలుకానుంది.

ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ ని సాధించలేని దక్షిణాఫ్రికా ఈరోజు జరగనున్న మ్యాచ్ గెలుపుతో బోణి కొట్టి లీగ్ ని విజయవంతంగా ప్రారంభించాలని చూస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు వన్డేలలో తప్ప టీ20లలో ఒక్కసారి టైటిల్ ని గెలువకపోవడంతో ఈసారైన టీ20 ప్రపంచకప్ లో తమ సత్తా చూపించాలని పట్టుదలతో ఉంది.

ఇక ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 21 మ్యాచ్ ల హోరాహోరి పోరులో ఆస్ట్రేలియా 13, దక్షిణాఫ్రికా 8 మ్యాచ్ లలో గెలుపొందింది. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండనున్నాయి.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్/పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్, టెంబా బావుమా (సి), ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్‌గిడి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com