'ఊపిరి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి
- March 19, 2016
సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను నాగార్జున కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యధిక థియేటర్స్ మార్చి 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ..ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ '' మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత నాగార్జునగారు ఈ చిత్రంలో టోటల్‌గా డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే 'ఆవారా' కార్తీ, తమన్నా జంట ఈ చిత్రంతో మరోసారి ఆడియన్స్ ని అలరించబోతున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బావుందని ప్రశంసించారు. మార్చి 25న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను వరల్డ్ వైడ్ గా 2000 ఆంద్రప్రధేశ్, తెలంగాణ, తమిళనాడు , కర్ణాటక, నార్త్ ఇండియా, యు.ఎస్, గల్ఫ్ కంట్రీస్, మలేషియా, శ్రీలంక, సింగపూర్, యు.కె, ఆప్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







