ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ లో రిక్రూట్ మెంట్ డ్రైవ్

- October 26, 2021 , by Maagulf
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ లో రిక్రూట్ మెంట్ డ్రైవ్

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పెరగడం.. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రమంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు తొలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ రాబోయే ఆరు నెలల్లో 6,000 మందికి పైగా సిబ్బందిని నియమించుకోవాలని యోచిస్తోంది. కొత్తగా నియమించే వారిలో అదనపు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజినీరింగ్ నిపుణులు, గ్రౌండ్ స్టాఫ్ ఉండనున్నారు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్ కు ప్రయాణికుల నుంచి డిమాండ్, దుబాయ్ నుంచి ఇతర ఎమిరెట్స్ దేశాలకు నెట్ వర్క్ పెరిగిన నేపథ్యంలో 700 మంది గ్రౌండ్ స్టాఫ్ కొత్తగా రిక్రూట్ చేసుకోనున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా 600 మంది క్వాలిఫైడ్ పైలట్లను... 1,200 మంది ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్లు, ఇంజినీరింగ్ సపోర్ట్ స్టాఫ్‌ ను నియమించుకోనున్నారు.ఉద్యోగ వివరాల కోసం ఈ క్రింద లింకు లో చూడగలరు.

https://www.emiratesgroupcareers.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com