ప్రవాసులకు శుభవార్త. ఉద్యోగ బదిలీ నిబంధన తొలగింపు
- October 26, 2021
సౌదీ: ఇకపై మరింత స్వేచ్ఛగా ఉద్యోగాలను మార్చుకోవచ్చని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే యాజమాని దగ్గర ఏడాదిపాటు కచ్చితంగా పనిచేయాలనే నిబంధనను తాజాగా సవరించారు. ఇకపై ఎప్పుడంటే అప్పుడు ప్రవాస కార్మికుడు తను చేస్తున్న ఉద్యోగాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కార్మిక చట్టానికి సవరణ చేసినట్టు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి ఆమోదించారు. అయితే ప్రైవేట్ రంగానికి నితాఖత్ సౌదైజేషన్ ప్రోగ్రామ్‌లో నిర్దేశించిన షరతులను ఉల్లంఘించరాదని, బదిలీకి ప్రస్తుత యజమాని సమ్మతిని పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త కార్మిక చట్ట సవరణలను సౌదీ గెజిట్ లో ప్రచురించారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి