బంపుర్ ఆఫర్ కొట్టేసిన సమంత..నయనతార ప్రాజెక్ట్ ఇప్పడు సమంత చేతిలో
- October 27, 2021
చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. నయన్ కూడా షారూఖ్ సినిమా అనగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇప్పుడు షారూఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్ కేసులో ఇరుక్కోవడంతో మరింత అలస్యం అవుతోంది. కానీ నయన్ విఘ్నేష్ శివన్ తో పెళ్ళికి రెడీ అవుతూ తను ఈ ప్రాజెక్ట్ చేయలేనందట. మళ్ళీ ఆ ఆఫర్ సమంత ముందు వాలింది. సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నిజానికి ఇప్పటకే ఈ సినిమా చేస్తున్నట్లు అధికారక ప్రకటన వెలువడవలసింది. కానీ ఆర్యన్ డ్రగ్ కేసు వల్ల ఆలస్యం అవుతోందట. త్వరలోనే అఫిషీయల్ గా ప్రకటిస్తారట. మరి ఈ సినిమాతో సమంత బాలీవుడ్ లోనూ పాగా వేస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!