నవంబర్ 3న ఘనంగా జెండా దినోత్సవం
- October 27, 2021
యూఏఈ: నవంబర్ 3న ఉదయం 11:00 గంటలకు జెండా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నట్లు UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఈ విషయాన్ని షేక్ మహ్మద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "సోదర సోదరీమణులారా, UAE తన 50వ సంవత్సర జెండా దినోత్సవాన్ని వచ్చే నవంబర్ మూడో తేదీన జరుపుకుంటుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థల వద్ద ఉదయం పదకొండు గంటలకు జెండాను ఎగురవేయనున్నాము. ఎమిరేట్స్ లోని నేల పట్ల విధేయత, ప్రేమను నెలకొల్పడానికి గత యాభై ఏళ్ల రాష్ట్రం, సార్వభౌమత్వం, ఐక్యత యొక్క చిహ్నం వచ్చే యాభై ఏండ్ల వరకు మనతోనే ఉంటుంది." అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...







