కేవలం 392 దిర్హాములకే భారత్ ప్రయాణం
- October 27, 2021
యూఏఈ-ఇండియా విమానాలు: యూఏఈ లోని అల్ ఐన్-కోజికోడ్ సర్వీసును 392 దిర్హామ్‌లతో పునఃప్రారంభించింది ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్. వివరాల్లోకి వెళితే..
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల నుండి అబుదాబిలోని అల్ ఐన్ నుండి కేరళలోని కోజికోడ్ వరకు తన సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌లైన్ అబుదాబి కార్యాలయం తెలిపింది.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ లో తీసుకున్న దేశవ్యాప్త ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 2020లో విమాన సర్వీసు నిలిపివేయబడింది. తిరిగి సర్వీసులను ప్రారంభిస్తుండటంతో, విమానయాన సంస్థ ప్రయాణికులకు Dh392 నుండి ప్రత్యేక టిక్కెట్ ధరను అందిస్తోంది.
మొదటి ఫ్లైట్ నవంబర్ 4 నుండి ప్రారంభమవుతుంది. వారానికి ఒక ఫ్లైట్ చొప్పున ప్రతి గురువారం ఈ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. అనగా, మొదటి ఫ్లైట్ (IX 0335) కోజికోడ్ నుండి టేకాఫ్ అయ్యి మధ్యాహ్నం 12.25 గంటలకు అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అదే రోజు అల్ ఐన్ నుండి తిరుగు ప్రయాణం (IX 0336) మధ్యాహ్నం 1.25 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..