‘మంచి రోజులు వచ్చాయి’ సెన్సార్ పూర్తి!

- October 27, 2021 , by Maagulf
‘మంచి రోజులు వచ్చాయి’ సెన్సార్ పూర్తి!

హైదరాబాద్: సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమంటున్నారు దర్శకుడు మారుతీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com