‘పుష్పక విమానం’ ట్రైలర్ విడుదలకు సన్నాహాలు
- October 29, 2021
హైదరాబాద్: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నారు అల్లు అర్జున్. బన్నీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం “పుష్పక విమానం” యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.
“పుష్పక విమానం” సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.
టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









