కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు
- October 29, 2021
బెంగుళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. పునీత్ కుటుంబ సభ్యులను కర్ణాటక సీఎం పరామర్శించారు.
అతి చిన్న వయసులో గుండెపోటు బారిన పడిన నటుడు పునీత్ రాజ్ కుమార్ కావడం గమనార్హం. ఎప్పుడూ ఫిట్ గా ఉండే ఆయన హఠాత్తుగా గుండెపోటు బారిన పడడం అభిమానులతో పాటు సెలెబ్రిటీలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రీసెంట్ గా “బజరంగీ 2” సినిమా వేడుకకు పునీత్ రాజ్ కుమార్ హాజరయ్యారు. అన్న శివరాజ్ కుమార్‌తో సహా సినీ ప్రముఖులతో ఆయన గడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..