ఫ్రాన్స్‌లో బిజీబిజీగా కేటీఆర్..
- October 29, 2021
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. అందులో భాగంగా మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను, సహకార అవకాశాలను వివరించారు.
తెలంగాణలో ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో సాధించిన విజయాలను వారికి తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఎఫ్ బృందంతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన THub, WeHub,TWorks కు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!