నేటి నుంచే కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు..
- October 31, 2021
అబుధాబి: కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ నేటి నుంచే అమల్లోకి రానున్నాయని అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. బిజినెస్, ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, ఎగ్జిబిషన్ లకు సంబంధించిన అన్ని ఈవెంట్లను కొత్త నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొంది. ఇవెంట్లకు హాజరయ్యే వారు కచ్చితంగా 96 గంటల్లోపు చేయించుకున్న నెటిటివ్ పీసీఆర్ పరీక్ష రిపోర్టును అల్హోస్న్ యాప్‌లో అప్ లోడ్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులను ధరించాలి. వారం క్రితం నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA), జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) UAE సిటిజన్స్ కోసం కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ను అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త అప్‌డేట్ ప్రకారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ల పూర్తి మోతాదులను పొందిన వారు మాత్రమే అనుమతి ఉన్న జాబితాలోని దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







