5 ఏళ్లు పైబడిన పిల్లలకు COVID-19 వ్యాక్సిన్.. సుప్రీం కమిటీ ఆమోదం
- October 31, 2021
ఒమన్: నవంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు COVID-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సుప్రీం కమిటీ ఆమోదం తెలిపింది. నవంబర్ మొదటి వారం నుంచి వీరికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. అలాగే COVID-19 బారిన పడే అవకాశం ఉన్నవారికి మూడో డోస్ COVID-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యున్నత కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీరికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. వేలంపాటలు, ప్రీ-ఈద్ సౌక్‌లు, ఓపెన్ ఎయిర్ మార్కెట్ల వంటి సాంప్రదాయ మార్కెట్‌లను తిరిగి తెరవడానికి అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అదే విధంగా అందరూ విధిగా మాస్కులు ధరించడం, విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నివారించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని అత్యున్నత కమిటీ నొక్కి చెప్పింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







