భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు
- November 01, 2021
కువైట్: ఇండియా, కువైట్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 31న కువైట్ టవర్స్ పై ఇండియా, కువైట్ జాతీయ జెండాలను ప్రదర్శించారు. కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జ్ ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలను గుర్తు చేశారు. పరస్పర విశ్వాసం, అవగాహన, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఇండియా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు.. ఐకానిక్ కువైట్ టవర్స్ పై భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడంపై జార్జ్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన పురోగతికి మద్దతు, సహకారానికి కువైట్ నాయకత్వానికి, కువైట్ ప్రజలకు రాయబారి సిబి జార్జ్ ధన్యవాదాలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









