దుబాయ్‌లో అంగరంగ వైభవంగా 'టిఓఐఎఫ్‌ఎ'

- March 20, 2016 , by Maagulf
దుబాయ్‌లో అంగరంగ వైభవంగా 'టిఓఐఎఫ్‌ఎ'


బాలీవుడ్‌ తారల మెరుపులతో దుబాయ్‌ పులకించిపోయింది. అవార్డుల వేడుక సినీ అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపింది. పండుగలా జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు తామ డాన్సులతో హోరెత్తించారు. దుబాయ్‌లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించారు. అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌, కరీనాకపూర్‌, రణ్‌వీరసింగ్‌ ఇంకా ఎందరో ప్రముఖులు రెడ్‌ కార్పెట్‌ మీద నడుస్తూ, డాన్స్‌ ఫ్లోర్‌ మీద సందడి చేస్తూ అభిమానుల్ని అలరించారు. ఈ వేదికపైనుంచే రణ్‌వీర్‌కపూర్‌ దీపికా పడుకొనే తన 'బెటర్‌ ఆఫ్‌' అని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కజ్‌రారే పాటలో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి అమితాబ్‌బచ్చన్‌ కూడా కాలు కదపడం ఈ ప్రోగ్రామ్‌కే పెద్ద హైలైట్‌. అమితాబ్‌ సూపర్‌ హిట్‌ సినిమాల్లోని పాటలకు రణ్‌వీర్‌సింగ్‌ డాన్స్‌ చేశాడు. ఆద్యంతం తారలు ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్‌ చేయడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com