పవన్ అభిమానుల ఆందోళన..
- March 20, 2016
పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ చిత్ర ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరగనుంది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానుండడంతో ఈ కార్యక్రమానికి ఎలా అయిన హాజరు కావాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాకపోతే పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొనడంతో పవన్ అభిమానులు బ్లడ్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది.కేవలం తెలుగు రాష్ర్టాలనుండే కాక కర్ణాటక, బెంగళూర్ తదితర ప్రాంతాల నుండి తరలి వచ్చిన అభిమానులు తాము లేకుండా ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తారు అని ప్రశ్నించినట్టు సమాచారం. ఇలాంటి సంఘనలు జరుగుతాయని భావించే పవన్ ఆడియో ఫంక్షన్‌ను చేయోద్దని నిర్‌ణయించుకున్నారు. కాని సినిమా ప్రమోషన్‌కు ఇది తప్పని సరి కాబట్టి నిర్మాతలు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసారు.అయితే అభిమానులు ఇలా ఆందోళనలకు దిగడంతో నిర్మాత ఆలోచనలో పడ్డారట. మరి ఈ వివాదాన్ని సాయంత్రంలోపు ఏ కొలిక్కి తీసుకొస్తారో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







