ఫ్లై దుబాయ్ ప్రమాదం: 20,000 డాలర్ల ఎక్స్‌గ్రేషియా
- March 20, 2016
ఫ్లై దుబాయ్ సంస్థ, విమాన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 20,000 (73,500 దిర్హామ్‌లు) డాలర్ల చొప్పున ఎక్స్‌గ్రేషియాని అందించనున్నట్లు ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించారు. డబ్బుతో వారి ప్రాణాలకు విలువ కట్టడంలేదనీ, ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిథులు చెప్పారు. బ్లాక్ బాక్స్ మరియు ఫ్లైట్ రికార్డర్స్ని ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. మృతుల కుటుంబాల్ని గుర్తించి, వారికి తగిన సమాచారం ఇచ్చే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఐదుగురు సిబ్బంది, 55 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







