దుబాయ్‌లో అంగరంగ వైభవంగా 'టిఓఐఎఫ్‌ఎ'
- March 20, 2016
బాలీవుడ్ తారల మెరుపులతో దుబాయ్ పులకించిపోయింది. అవార్డుల వేడుక సినీ అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపింది. పండుగలా జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ తారలు తామ డాన్సులతో హోరెత్తించారు. దుబాయ్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్, కరీనాకపూర్, రణ్వీరసింగ్ ఇంకా ఎందరో ప్రముఖులు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ, డాన్స్ ఫ్లోర్ మీద సందడి చేస్తూ అభిమానుల్ని అలరించారు. ఈ వేదికపైనుంచే రణ్వీర్కపూర్ దీపికా పడుకొనే తన 'బెటర్ ఆఫ్' అని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కజ్రారే పాటలో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి అమితాబ్‌బచ్చన్ కూడా కాలు కదపడం ఈ ప్రోగ్రామ్‌కే పెద్ద హైలైట్. అమితాబ్ సూపర్ హిట్ సినిమాల్లోని పాటలకు రణ్‌వీర్‌సింగ్ డాన్స్ చేశాడు. ఆద్యంతం తారలు ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







