ఫ్లై దుబాయ్‌ ప్రమాదం: 20,000 డాలర్ల ఎక్స్‌గ్రేషియా

- March 20, 2016 , by Maagulf
ఫ్లై దుబాయ్‌ ప్రమాదం: 20,000 డాలర్ల ఎక్స్‌గ్రేషియా

ఫ్లై దుబాయ్‌ సంస్థ, విమాన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 20,000 (73,500 దిర్హామ్‌లు) డాలర్ల చొప్పున ఎక్స్‌గ్రేషియాని అందించనున్నట్లు ఫ్లై దుబాయ్‌ వర్గాలు వెల్లడించారు. డబ్బుతో వారి ప్రాణాలకు విలువ కట్టడంలేదనీ, ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిథులు చెప్పారు. బ్లాక్‌ బాక్స్‌ మరియు ఫ్లైట్‌ రికార్డర్స్‌ని ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. మృతుల కుటుంబాల్ని గుర్తించి, వారికి తగిన సమాచారం ఇచ్చే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఐదుగురు సిబ్బంది, 55 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com