జీలకర్ర-దాల్చిన చెక్క పానీయంతో ఆరోగ్య లాభాలు

- November 05, 2021 , by Maagulf
జీలకర్ర-దాల్చిన చెక్క పానీయంతో ఆరోగ్య లాభాలు

జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం రోజూ తాగితే..వంటకు వాడే జీలకర్ర అద్భుతమైన జీర్ణక్రియ సాధనం. ఒంట్లో అజీర్తిగా అనిపించినప్పుడు ఓ స్పూన్ జీలకర్ర తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇక జీలకర్రకు దాల్చిన చెక్క జోడించి పానీయం తయారు చేస్తే పెరుగుతున్న బరువుకు చెక్ పెట్టవచ్చు. జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం తయారు చేసే విధానం.. 1 లీటరు నీరు 3 స్పూన్స్ జీలకర్ర 3-అంగుళాల దాల్చినచెక్క తేనె తగినంత నిమ్మరసం తగినంత

తయారీ విధానం:

ఒక పెద్ద గిన్నెలో, ఒక లీటరు నీటిని తీసుకోండి. జీలకర్ర మరియు దాల్చినచెక్క వేసి, బాగా మరగనివ్వాలి. ఇది కొద్దిగా చల్లబడిన తరువాత ఆ నీటిని వడకట్టండి. ఒక గ్లాసులో గోరు వెచ్చగా ఉన్న ఈ నీటిని తీసుకుని దానికి ఓ స్పూన్ తేనె, నిమ్మరసం వేసి బాగా కలపండి. కొవ్వు కరిగించే ఈ పానీయాన్ని ఉదయాన్నే త్రాగండి. జీలకర్ర, దాల్చిన చెక్క చేసే మేలు.. దాల్చినచెక్క యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అదే సమయంలో కొవ్వు కరిగించడానికి కూడా సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. మరోవైపు, జీలకర్ర జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com