పాస్‌పోర్ట్ కవర్ కోసం ఆర్డ్‌ర్ చేస్తే...ఏకంగా పాస్‌పోర్టే వచ్చేసింది
- November 05, 2021
కేరళ: ఆన్‌లైన్ షాపింగ్ రంగం అభివృద్ది చెందిన తరువాత చిన్న చిన్న వాటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటిపై ట్రోల్ చేస్తూనే ఉన్నారు.ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల జరిగింది.కేరళకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. బుక్ చేసిన కవర్ ఇంటికి వచ్చింది. పార్శిల్ కవర్‌ను ఒపెన్ చేసి చూసి మిథున్ షాక్ అయ్యాడు.
పార్శిల్ కవర్‌లో పాస్‌పోర్ట్ కవర్ తో పాటుగా ఒరిజినల్ పాస్‌పోర్ట్‌కూడా ఉన్నది.వెంటనే ఈ విషయాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేసి చెప్పగా, పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని సమాధానం ఇచ్చారు.ఆ ఒరిజినల్ పాస్‌పోర్ట్ త్రిసూర్‌కు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తికి సంబంధించినది.ఆ పాస్‌పోర్ట్ అమెజాన్ చేతికి ఎలా వచ్చింది అన్నది అర్ధంగాని విషయం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







