FOI ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

- November 05, 2021 , by Maagulf
FOI ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

దుబాయ్: డిసెంబర్ 02న యూఏఈ నేషనల్ డే సందర్భంగా దుబాయ్ లో  'FOI ఈవెంట్స్' వారు దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు భారత కాన్సులేట్ తో కలిసి లతిఫా హాస్పిటల్లో ఈ రోజు ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ నుంచి సంజయ్ కుమార్ గుప్త (వైస్ కాన్సుల్), ముఖ్య అతిధిగా విచ్చేసారు.మోహన్ నర్సింహా మూర్తి(ఫౌండర్ FOI ఈవెంట్స్) మాట్లాడుతూ...బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో 100 మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు ఇండియన్ కాన్సులేట్ నుండి తమకు ఎల్లప్పుడూ మద్దతు లభిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన నరేష్ కుమార్ మాన్యం,రమేష్ పాత,అభిమన్యు,రుద్రపల్లి తిరుపతి,పెరిక సురేష్,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,కుంభాల మహేందర్ రెడ్డి,నవనీత్,శరత్,ఆనంద్ కందూరి,రాజేష్, సత్యనారాయణ రెడ్డి,ఆనంద్ కందుకూరి,రాజేష్,గుండెల్లి నర్సింహులు మరియు పనాచి బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com