నోటి దుర్వాసన నికి కారణాలు.!
- March 20, 2016
సాధారణంగా వేళకు భుజించకుండా వేళతప్పి తినడం ఒక ముఖ్య కారణం అంతేకాక అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కడుపులోని ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.తీసుకోవల్సిన జాగ్రత్తలు : అలాంటి వారు తమ ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించటం ఎంతో అవసరం. రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.ఇలా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంటే వారి దంతాలు మరియూ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి నోటి ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది. భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి. ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుగంధభరితమౌతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







