మహారాష్ట్రలో కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 10 మంది సజీవదహనం
- November 06, 2021
అహ్మద్ నగర్: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కోవిడ్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు.
అహ్మద్‌నగర్‌లోని కొవిడ్ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన కనీసం 10 మంది కరోనా పేషెంట్స్ సజీవదహనమయ్యారు. అగ్నిప్రమాదంలో గాయపడిన మరో 11మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బందితో సహా వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







