దుబాయ్‌లోని జుమైరా రోడ్‌ ట్రాఫిక్‌ జాంకి చెక్‌

- March 20, 2016 , by Maagulf
దుబాయ్‌లోని జుమైరా రోడ్‌ ట్రాఫిక్‌ జాంకి చెక్‌


దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) కొత్త బ్రిడ్జ్‌ని ప్రారంభించింది. అల్‌ ఆథర్‌ రోడ్‌ నుంచి అల్‌ హాదికా రోడ్‌కి మధ్యలో అల్‌ వసల్‌ రోడ్‌ మీదుగా నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జ్‌ ర్యాంప్‌తో ట్రాఫిక్‌ జాంఝాటానికి చెక్‌ పడింది. జుమైరా రోడ్‌ నుంచి అల్‌ అథర్‌ రోడ్‌ వరకు అల్‌ హాదికా రోడ్‌ మరియు షేక్‌ జాయెద్‌ రోడ్‌లకు ట్రాఫిక్‌ని సులభతరం చేస్తుంది ఈ ర్యాంప్‌. నిర్మాణపనులు 80 నుంచి 90 శాతం పూర్తి కాగా, ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అనుమతినివ్వడంతో ఇన్నాళ్లుగా ఎదురైన ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలావరకు తొలగిపోయాయి. అల్‌ వస్ల్‌ రోడ్‌ బ్రిడ్స్‌ 90 శాతం పూర్తి కాగా, మే నెల నాటికి బ్రిడ్జ్‌ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com