బహ్రెయిన్‌లో ఇద్దరు మహిళా వలసదారుల ఆత్మహత్య
- March 20, 2016
ఆసియాకి చెందిన ఇద్దరు మహిళా వలసదారులు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. నేపాల్‌కి చెందిన ఇద్దరు మహిళలు తమ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. సల్మానియా మరియు ఆలి ప్రాంతాల్లో ఈ ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సల్మానియా ఘటన చోటు చేసుకుంది. నితా నేపాలి అనే మహిళ క్లీనింగ్ స్టాఫ్‌గా మనామాలోని వైబ్రెంట్ సర్వీసెస్‌లో పనిచేస్తోంది. మరో ఆరుగురు నేపాలీలతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఈమె నివసిస్తోంది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో నితా మృతదేహం భద్రపరచబడింది. కేసు విచారణలో ఉందనీ, ప్రాసెస్ పూర్తయ్యాక నితా మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఆలిలో ఆత్మహత్య చేసుకున్న మహిళకు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







