ఈ క్రేజీ కాంబో తో అభిమానులకు పండగే!
- November 07, 2021మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్ర్కీన్ షేర్ చేసుకుంటే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మంచి కథ దొరికితే.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కించాలని పలువురు దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే దానికి ఇప్పుడు సమయం ఆసన్నమైందని అంటున్నారు. చిరు, పవన్ ఇద్దరూ ఒక సినిమాలో అన్నదమ్ములుగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. Mega 154 సినిమాతోనే ఆ కోరిక తీరనుందని వినికిడి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం నిన్న (శనివారం) పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి పక్కా మాస్ పాత్రను పోషిస్తున్నారు. వైజాగ్ హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకి ‘వాల్తేరు శీను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇందులో చిరంజీవి తమ్ముడిగా నటించేందుకు పవన్ కళ్యాణ్ ను బాబీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాలో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. దానికి చిరు సొంత తమ్ముడైతే ఇంకా బలంగా ఉంటుందని బాబీ ఆయన్ను సంప్రదించారట. మరి పవన్ దానికి ఒప్పుకుంటారా లేదా అన్నది సంశయమే. ‘వెంకీ మామ’ మూవీతో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్యను ఒక స్ర్కీన్ పై ఆవిష్కరించి అభిమానుల్ని అలరించారు బాబీ. ఈ తరహాలోనే ఇప్పుడు మెగాస్టార్ , పవర్ స్టార్ తో బాబీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే పవర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తారేమో చూడాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం