తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- November 07, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,72,489కి చేరింది. కరోనా నుంచి 6,64,759 మంది కోలుకోగా మొత్తం 3,966 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,764 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్‌లో ఓవర్‌స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









