కవితాలోకపు మాయాజాలం
- November 08, 2021
నింగి సాగరమున చంగుచ్చంగున ఎగిరే విహంగములవలె
చిగురుపూతతొ చెలిమి చేసే పిల్లగాలులవలె
పసిడి పాపడి పాలబుగ్గల బోసినవ్వులవలె
భావజీవం పులుముకున్న వేణు నాదంవలె
వానపడితే పలకరించే మట్టివాసనవలె
మనసులోన ఉప్పొంగి ఎగసే ఉప్పెనలవలె
ఉదయభానుడి లేత కిరణపు తాకిడిలవలె
తనువుకందని మనసుకందే భావమువలె
భారమెక్కిన మనసుతో ఉరిమి చూసే మేఘమువలె
మౌనరాగమున నిద్రపుచ్చే నింగిలోని చంద్రునివలె
చిరుజల్లు కురియగ నాట్యమాడే మయూరమువలె
మదిలో మెదిలే ఊసులకంతం లేని అనంతంవలెనే కదా కవితలోకపు మాయాజాలం.
--- రాకేష్ మాలేపు
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!