స్మార్ట్ గా ట్రాఫిక్ సేవలు.. డిజిటల్ మోడ్ లోకి ఐదు సర్వీసులు
- November 08, 2021యూఏఈ: ట్రాఫిక్ సర్వీసులను ఇకపై ఇంటినుంచే మరింత సులభంగా పొందొచ్చు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 5 ట్రాఫిక్ సర్వీసులను డిజిటల్ మోడ్ లోకి మారుస్తున్నట్లు షార్జా స్మార్ట్ అప్లికేషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. ట్రాఫిక్ ఫైల్‌ను తెరవడం, వాహన ఓనర్ షిప్ సర్టిఫికేట్ జారీ చేయడం, ట్రాఫిక్ పాయింట్లను డ్రైవర్ లైసెన్స్ కిందకు మార్చడం, వాహనం సీజ్ వ్యవధి అలవెన్స్ చెల్లించడం, వాహనం జప్తు రద్దు సర్టిఫికేట్ జారీ చేయడం వంటి సర్వీసులు ఉన్నాయి. ప్రజలు నిరంతర సేవలు పొందేందుకు ఇది దోహదం చేస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. డిజిటల్ విధానంలో నిర్దేశిత సేవలను కచ్చితత్వంతో వేగంగా అందించే అవకాశం ఏర్పడుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాపడింది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!