స్కూళ్ల ఫీజుల దోపిడీ అరికడతాం : కేసీఆర్
- March 21, 2016
: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ, అరాచకాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల ఆదర్శంగా నడుస్తోందన్నారు. గుర్తింపు లేని స్కూళ్లపై సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమన్న సీఎం ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







