ట్విట్టర్ ద్వారా మరింత చేరువగా
- March 21, 2016
యూఏఈ లీడర్స్, ఏజెన్సీస్ ట్విట్టర్‌ని మరింత బాగా వినియోగించుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించాయి. కొత్త చట్టాల్ని ప్రకటించడం, క్యాబినెట్ని రి-స్ట్రక్చర్ చేయడం, అలాగే ప్రజల్ని పలు అంశాలపై అప్రమత్తం చేయడం, యాక్సిడెంట్స్తోపాటు క్రైమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం వంటివాటి కోసం ట్విట్టర్‌ని వేదికగా చేసుకోవాలని పాలకులు, ఏజెన్సీలు ఆలోచించాయి. యూఏఈ లీడర్స్, ప్రభుత్వ ఏజెన్సీలు ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. యూఏఈ ప్రైమ్ మినిస్టర్ దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 లీడర్స్‌లో ఒకరిగా షేక్ మొహమ్మద్ ట్విట్టర్ ఫాలోవర్స్ కేటగిరీలో ఉన్నారు.ప్రభుత్వ నిర్ణయాల్ని షేక్ మొహమ్మద్ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజల అభిప్రాయాల్నీ స్వీకరిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దుబాయ్ పోలీస్ కూడా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్నాయి. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ట్రాఫిక్ అప్డేట్స్, రోడ్ క్లోజర్స్, బ్రిడ్జిల ప్రారంభం వంటి వాటి గురించిన సమాచారం అందిస్తోంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ ట్విట్టర్ ద్వారా వాతావరణ సంబంధిత విషయాలను తెలియజేస్తోంది. తద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







