యాక్సిడెంట్లో మృతిచెందిన చిన్నారికి కన్నీటి వీడ్కోలు
- March 21, 2016
అల్ మెస్లియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఐదేళ్ళ చిన్నారి ఐదెన్ షాజి వర్గీస్‌కి భారతీయ వలసదారులు కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం సాయంత్రం ఐదెన్ మృతదేహాన్ని అతని స్వస్థలమైన కేరళలోని పథనమ్‌తిట్ట జిల్లాలోగల తిరువాలాకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. సర్వోదయ కిండర్‌గార్టెన్‌లో చదువుతున్న ఐదెన్, స్కూల్ బస్సులో వెళుతుండగా, బస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదెన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురు గాయాల పాలు కాగా, అందులో ఒకరికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. ఇంటి నుంచి మదినత్ ఖలీఫాలో గల స్కూల్‌కి వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎంకె మునీర్, ఖతార్‌లో పర్యటించారు. గురువారం ఆయన ఐదెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐదెన్ తండ్రి షాజి వర్గీస్ ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్నారు. ఐదెన్ తల్లి రీనా మాథ్యూ రుమైలా ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







