మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు
- March 21, 2016
ఇండోనేషియాలో ఆదివారం మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి మిలిటరీ అధికారులు వెల్లడించారు. సోమవారం మరో సైనికుడి మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 13కు చేరిందని చెప్పారు. ఈ విషయమై మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ తతాంగ్ సులేమాన్ మాట్లాడారు.'బెల్ 412 -ఈపీ' అనే మిలటరీ హెలీకాఫ్టర్ 13 మంది సైనికులతో పోసో జిల్లాలోని వతుతువా గ్రామం నుంచి ఆదివారం టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన 35 నిమిషాల్లో ఇంజిన్లో మంటలు చెలరేగి కూలిపోయింది. ఆదివారం నాడు 12 మృతదేహాల్ని గుర్తించగా సోమవారం మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆ హెలీకాఫ్టర్ కొని మూడేళ్లైందని చెప్పారు. ప్రయాణం సమయంలో ఆకాశంలో మెరుపులు రావడంతో మెరుపుల దాటికి దానిలో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







