5 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసిన పాలరాయి ముక్క
- March 21, 2016
దుబాయ్ లో ఆసియా దేశానికి చెందిన 5 ఏళ్ల బాలుడి తలపై పాలరాయి ముక్క విరిగి పడటంతో ఆ చిన్నారీ అనూహ్యంగా మరణించిన సంఘటన స్థానికులను కలవరపరచింది. 'అల్ బయాన్' తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక పార్టీకు తనతల్లిదండ్రులతో వెళ్ళిన ఆ బాలుడు వారికి దూరంగా వెళ్ళి ఆటలలో నిమగ్నమయ్యాడు. ఇదే సమయంలో పెద్ద పాలరాయి ముక్క తన తలపై పడిపోయిందని ఆల్ బర్ష పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ యూసుఫ్ అల్ ఓడిది తెలిపారు.బాలుని తలకు తీవ్రమైన గాయం కావడంతో అంబులెన్స్ లో పిల్లల ఆసుపత్రికి తరలించే యత్నంలో మార్గ మధ్యలోనే ఆ బాలుడు మరణించాడని , కల్నల్ ఓడిది చెప్పారు. కాగా ఈ ప్రమాదంపై తాము పరిశోధన జరపగా ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని విచారణలో తేలినట్లు ఆయన వివరించారు. హోటల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఏదైనా తెలియని మరో కోణం ఉందా అని తాము నిఘా కెమెరా లోని గడిచిన సంఘటనకు సంబంధించిన వీడియో టేప్ లను అధ్యయనం చేసి ఏ ఒక్కరి ప్రమేయం లేదనిమ బాలుడు తనకు తానే ప్రమాదంలో పడినట్లు తేట తెల్లమయందని కల్నల్ అల్ ఓడిది పేర్కొన్నారు. ఈ సంఘటన ఒక ప్రార్థనా స్థలాల వద్ద జరిగినట్లుగా కొందరు కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. ఉద్యోగులకు కంపెనీ నిర్వహించిన పార్టీలో స్నేహితులతో ఊరి బయట ఉన్న హోటల్ లో పార్టీ జరిగినట్లు ఆయన తెలిపారు. తమ పిల్లవాడికి శవపరీక్ష నిరాకరించిన తండ్రి తొలుత అంగీకరించకపోయినా చివరకు తమ బిడ్డ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా అప్పగించాలని అభ్యర్థించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కాగా ముద్దులోకికే 5 ఏళ్ల బాలుడి అర్ధంతరంగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిని ఓదార్చటం ఎవరికీ సాధ్యం కావడం లేదు. చట్టపరమైన లాంఛనాలను పూర్తి కాగానే ఆ బాలుడి పార్ధివ శరీరాన్ని వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన బాలుడు దుబాయ్ లో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థి. కాగా పాఠశాల యాజమాన్యం బాలుని కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







