ట్రావెల్ ఎంట్రీ పాలసీని అప్డేట్ చేసిన బహ్రెయిన్
- November 11, 2021
బహ్రెయిన్: కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిని అరికట్టేందుకు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సిఫార్సులను ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌర విమానయాన వ్యవహారాలు (CAA) బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే వారి కోసం ట్రావెల్ ఎంట్రీ విధానాలను బహ్రెయిన్ అప్డేట్ చేసింది. మారిన కొత్త నిబంధనలు నవంబర్ 14 (ఆదివారం) నుండి అమల్లోకి రానున్నాయి.
కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలు
1. కరోనా నేపథ్యంలో అమలు చేసిన ట్రావెల్ రెడ్ లీస్ట్ ను రద్దు చేశారు.
2. బహ్రెయిన్‌కు వచ్చే వ్యాక్సిన్ వేసుకోని ప్రయాణీకులందరూ నిర్ణీత నిర్బంధ కేంద్రాల వద్ద కాకుండా వారి నివాస స్థలంలోనే క్వారంటైన్ లో ఉండొచ్చు.
వీటితోపాటు CAA ప్రస్తుతం అమలు చేస్తున్న ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహ్రెయిన్‌కు సంబంధించిన ట్రావెల్ ఎంట్రీ విధానాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్: healthalert.gov.bh లో చూడవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







