అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించిన తొలి ఖతార్ మహిళగా షేఖా అస్మా రికార్డు
- November 11, 2021
ఖతార్: ఖతారీ పర్వతారోహకురాలు షేఖా అస్మా బింట్ థానీ అల్-థానీ మరో ఘనత సాధించారు. అమా దబ్లామ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తొలి ఖతారీ మహిళగా షేఖా అస్మా రికార్డు సృష్టించారు. అమా దబ్లామ్ పర్వతంపై 6,812 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత షేఖా అస్మా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పర్వతారోహణకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టంగా, సంక్లిష్టంగా ఉందని షేఖా అస్మా ఆ పోస్టులో వెల్లడించారు. “అభినందనలు! ఖతారీ పర్వతారోహకురాలు షేఖా అస్మా బింట్ థానీ అల్-థానీ 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ శిఖరాన్ని చేరుకున్నారు. ఇది ఈ సంవత్సరం మా ఛాంపియన్ ల ఫోర్త్ సమ్మిట్. ఆమె మౌంట్ అమాడబ్లామ్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఖతార్ మహిళగా నిలిచింది.’’ అని ఖతార్ జట్టు చేసిన ట్వీట్ లో ఆమే సాధించిన విజయాన్ని గర్వించదగ్గ విజయంగా అభివర్ణించింది. షేఖా అస్మా ప్రపంచంలోని ఏడవ ఎత్తైన పర్వతం మౌంట్ ధౌలగిరి, మౌంట్ మనస్లూను కూడా అధిరోహించింది. ఆక్సిజన్ లేకుండా 8000 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన మొదటి అరబ్‌గా ఆమె నిలిచింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







