విమాన ఛార్జీల మోత...భారత్ కు వెళ్లాలంటే రెట్టింపు రేట్లు

- November 11, 2021 , by Maagulf
విమాన ఛార్జీల మోత...భారత్ కు వెళ్లాలంటే రెట్టింపు రేట్లు

యూఏఈ: చలికాలం సెలవుల కంటే ముందే విమాన ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, దుబాయ్ ఎక్స్ పో-2020, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వంటి మెగా ఈవెంట్‌ల కోసం వచ్చిన వారు తిరిగి స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయిన నేపథ్యంలో ఛార్జీల మోత మోగించారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా డిసెంబర్‌లో దుబాయ్ నుండి భారత ఉపఖండానికి విమాన ఛార్జీలను దాదాపు రెట్టింపు చేశారు. ఎయిర్ బబుల్ ఒప్పందాల కారణంగా తక్కువ విమానాలు నడుస్తున్నాయి. దీంతో రాబోయే కొద్ది నెలలు భారతీయ ఉపఖండానికి విమాన ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయని విమానయాన వర్గాలు తెలిపాయి. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చాలామంది భారతీయ కుటుంబాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఈ కారణంగా డిసెంబర్‌ నెలలో యూఏఈ-ఇండియాలోని కొన్ని విమాన మార్గాల్లో ఛార్జీలు 1,200 -1,300 దిర్హామ్స్ నుంచి 2,300 దిర్హామ్స్ కు పైగా పెంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com