'ఖిలాడీ' విడుదల తేదీ ఖరారు
- November 11, 2021
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఖిలాడి". సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. ఎ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022న ఖిలాడీ తెరపైకి రానుందని మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన రూపంలో కనిపిస్తున్నాడు. మాస్ మహారాజ అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







