"దృశ్యం-2" టీజర్..ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
- November 12, 2021
విక్టరీ వెంకటేష్ తాజా థ్రిల్లర్ డ్రామా చిత్రం 'దృశ్యం 2'. ఆయన హిట్ చిత్రం 'దృశ్యం' సీక్వెల్, మలయాళ చిత్రం 'దృశ్యం 2' రీమేక్. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ కేసు గురించి అందరూ మాట్లాడుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న ఆ కుటుంబం మళ్లీ చీకటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. ఆ ఇష్యూ నుంచి బయటపడేందుకు వెంకీ మరో మాస్టర్ ప్లాన్ తో వచ్చాడని తెలుస్తోంది. టీజర్ గ్రిప్పింగ్ గా కనిపించదమే కాదు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇదే టీజర్ తో సినిమా విడుదల గురించి చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించారు మేకర్స్. నవంబర్ 25న ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా ప్రీమియర్ కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ వంటి మొదటి భాగంలో నటించిన నటీనటులే 'దృశ్యం 2″లోనూ కనిపించనున్నారు. సంపత్ రాజ్, పూర్ణ సీక్వెల్‌లో కొత్త పాత్రలను పోషించారు. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







