గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్..ఆ నిర్ణయంతో భారతీయ అమెరికన్లకు మేలు..

- November 12, 2021 , by Maagulf
గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్..ఆ నిర్ణయంతో భారతీయ అమెరికన్లకు మేలు..

అమెరికాలో ఉద్యోగం ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలా మంది తీవ్రంగా కృషి చేస్తుంటారు. అలాగే అమెరికా వెళ్లాలనుకునే వారికి కూడా కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.
హెచ్ 1 బీ వీసా ఉన్న వారికి మాత్రమే అమెరికాలో ఉద్యోగం కోసం అనుమతి వస్తుంది. కానీ వారి జీవిత భాగస్వామ్యులకు మాత్రం అమెరికా పర్యటన అంత సులభం కాదు. భాగస్వామ్యులను అమెరికా తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనిపై ఎప్పటి నుంచో న్యాయస్థానాల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. అటు ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో కూడా అగ్రరాజ్యానికి ఈ విషయంపై వినతులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసా పొందిన వారు తమ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన హెచ్ 1 బీ వీసాతో... భాగస్వామ్యులను తోడు తీసుకుని వెళ్లొచ్చు. ఆటోమేటిక్ వర్క్ ఆధరైజేషన్ ప్రాతిపదికన జీవిత భాగస్వామ్యులను అనుమతిస్తున్నట్లు బైడెన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

అమెరికాలోని వలసదారుల జీవిత భాగస్వామ్యుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసి న్యాయస్థానం... బైడెన్ సర్కార్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బైడెన్ సర్కార్ కూడా జీవిత భాగస్వామ్యుల విషయంలో కీలక సవరణలు చేసింది. ఇప్పటి వరకు హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో పాటు అమెరికాలో విద్యా భ్యాసం చేస్తున్న 21 ఏళ్ల లోపు విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించేందుకు హెచ్ 4 బీ వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. అయితీ ఇవి పర్మినెంట్ కాదు. పూర్తిగా టెంపరవరీ కావడంతో.. వీటిని తరచూ పొడిగించాల్సి వస్తుంది. దీంతో ప్రతి సారి పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తోంది కూడా. ఈ వ్యవహారంపై ఎన్నో కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకున్న బైడెన్ సర్కార్... ఆటోమేటిగ్గా హెచ్ 4 బీ వీసాలు జారీ చేసేందుకు నిబంధనలను సవరించింది. ఇది అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గొప్ప శుభవార్త. జీవిత భాగస్వామ్యులతో పాటు తమ పిల్లలకు కూడా ఆటోమేటిగ్గా హెచ్ 4 బీ వీసాలు వస్తాయని ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com