రెసిడెన్సీ ఉల్లంఘనులకు క్షమాభిక్ష లేదు
- November 12, 2021
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా క్షమాభిక్ష పెట్టేది లేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో మానవీయ కోణంలో నాలుగుసార్లు క్షమాభిక్షకు అవకాశం కల్పించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎలాంటి జరీమానా చెల్లించకుండా, ఉచితంగా టిక్కెట్లను కల్పించి మరీ దేశం విడిచి వెళ్ళేందుకు కొందరికి అవకాశం కల్పించిన కువైట్, కొందరు ఉల్లంఘనులు తమ స్టేటస్ సరి చేసుకునేందుకూ అవకాశం ఇచ్చింది. అయినాగానీ, సుమారుగా 160,000 మంది ఉల్లంఘనులు క్షమాభిక్షను వినియోగించుకోలేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ స్పష్టం చేశాయి. జరీమానా చెల్లించి ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళాలనీ, అనంతరం వారు కొత్త వీసాపై తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని కువైట్ పేర్కొంది. అలా ముందుకు రాని వారిని అథారిటీస్ గుర్తించి పట్టుకుని, దేశం నుంచి పంపేస్తే, వారిపై జీవిత కాలం బ్యాన్ వుంటుందని అధికారులు తెలిపారు. వారు జిసిసి దేశాలకు ఐదేళ్ళ వరకు వచ్చేందుకు వీలుండదని కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







