రాజకీయ నాయకుల తీరుపై భారత ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు
- November 12, 2021
నెల్లూరు: ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, మాట్లాడే మాటలు రోత పుట్టిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరులోని ఓ స్థానిక పత్రిక 40ఏళ్ల వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాటలు, తెలుగు కట్టు, బొట్టు చాలారోజుల తరువాత చూడటం సంతోషంగా ఉందన్నారు. ఈ రాజ్యాంగ హోదా అలంకారంగా కనిపిస్తోందన్నారు.

జనంతో కలిసి జనంతో మాట్లాడుతుంటే దానిలో ఉండే ఆనందం ఈ రాజ్యాంగ హోదాలో లేదన్నారు. సంతోషంగా ఉండాలంటే అందరితో కలిసి తిరగాలని ఆయన సూచించారు. చదువు చెప్పిన గురువుని సన్మానించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. కరోనాను ఎదిరించడంలో ముందుండి అశువులు బాసిన జర్నలిస్టులు, వైద్యసిబ్బందికి ఆయన నివాళులర్పించారు. అనంతరం 40 మంది నెల్లూరు ప్రముఖులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిని సన్మానించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







