టిక్కెట్ ధరల్లో 50 శాతం తగ్గుదల: టూరిజం మరియు ట్రావెల్ కార్యాలయాల వెల్లడి
- November 13, 2021
కువైట్: టూరిజం సీజన్ కాకపోయినా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నందున కువైట్ వచ్చే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో, టిక్కెట్ ధరలు కూడా తగ్గినట్లు ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు నెలల క్రితం నాటి పరిస్థితితో పోల్చితే, సగం మేర టిక్కెట్ ధరలు (కువైట్ వచ్చేందుకు) తగ్గినట్లు తెలుస్తోంది. ఇండియా అలాగే ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి ఎక్కువగా ఎరైవల్స్ వుంటున్నాయి. కోటా విధానం రద్దు చేయడం కూడా కలిసొచ్చింది. సౌదీ అరేబియా, టర్కీ మరియు ఈజిప్టు నుంచి కువైట్ మధ్య ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం కోటాలో 60 నుంచి డెబ్భయ్ శాతం ఈ ప్రయానాలే వుంటున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







