కోవిడ్ 19 రిస్క్ దేశాలకు సంబంధించిన కేటగిరీల తాజా లిస్ట్ విడుదల
- November 13, 2021
దోహా: ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కోవిడ్ 19 రిస్క్ ప్రభావం ఆధారంగా ఆయా దేశాలతో కూడిన తాజా కేటగిరీ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. సోమవారం నుంచి ఈ అప్ డేట్ లిస్టు అమల్లోకి వస్తుంది. ఎక్సెప్షనల్ రెడ్ లిస్టులో 10 దేశాలున్నాయి. వీటిల్లో ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సుడాన్ మరియు సౌత్ సుడాన్ వున్నాయి. గ్రీన్ లిస్టులో 181 దేశాలు వున్నాయి. రెడ్ లిస్టులో 21 దేశాలున్నాయి. ఖతార్ వచ్చే ముదు ప్రయాణీకులు అండర్‌టేకింగ్ మరియు అక్నాలెడ్జిమెంట్ ఫార్మ్ పూర్తి చేయాలి. ఎంవోపిహెచ్ వెబ్సైట్లో ఇది లభ్యమవుతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వేదిక (ఎహ్తెరాజ్) ద్వారా కూడా చేయొచ్చు. వ్యాక్సినేషన్ పొందిన పౌరులు, నివాసితులు గ్రీన్ దేశాల నుంచి వస్తే, వారికి నిబంధనల నుంచి వెసులుబాటు వుంటుంది. పూర్తిగా వ్యాక్సిన్ పొందిన కతారీ పౌరులు, నివాసితులు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వస్తే, వారికి ప్రీ ట్రావెల్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదు. వచ్చిన తర్వాత 36 గంటల్లోపు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







